గత ఏడాది కరోనా కేసుల వల్ల పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న వారు అందరూ పెళ్లి ముహూర్తాల వేళ వాయిదా వేసుకున్నారు… ఇక ఈ ఏడాది కూడా కేసులు దారుణంగా వస్తున్నాయి… దీంతో పెళ్లి ముహూర్తం పెట్టుకున్న వారు మరో తేదికి వాయిదా వేసుకుంటున్నారు…మరికొందరు ఇంటిలో వారితోనే పెళ్లి తంతు ముగిస్తున్నారు.
అయితే తాజాగా ఇప్పటి వరకూ మౌఢ్యం బ్రేకులు వేసింది. మే నెలలో పెళ్లిళ్లకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఇక కెమెరాలు వీడియో, డెకరేషన్ ఫుడ్ కేటరింగ్ ట్రావెల్స్ ఇలా అందరికి మే నెల వచ్చింది అంటే ఫుల్ బీజీ ఉంటుంది కాని ఈ కరోనా వల్ల చాలా మందికి ఉపాది దూరం అయింది.
మరి పండితులు ఈ మే నెలలో పెళ్లి ముహూర్తాలు చాలా ఉన్నాయి అని చెబుతున్నారు… మే నెలలో ఏ తేదిలు బాగున్నాయి అనేది చూస్తే… మే 2, 4,7, 8, 21, 22, 23, 24, 26, 29, 31 తేదీలు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.