ఎక్కడ పెళ్లి గురించి మాట్లాడినా ఇంటి శంకుస్ధాపన కోసం చూసినా గృహ ప్రవేశం గురించి మాట్లాడినా అందరూ కూడా పండితులు చెప్పేది పెద్దలు చెప్పేది మాఘమాసం పెట్టుకో అంటారు… ఈ సమయంలో ఎంతో మంచి శుభం జరుగుతుంది అంటారు…అయితే ఇది మన పెద్దలు ఏ నాటి నుంచో నమ్ముతూ వస్తున్నారు… ఎన్నో కార్యక్రమాలు ఈ సమయంలోనే ఎక్కువగా చేస్తారు…. అయితే ఈ మాఘమాసంలో ఇలా పెళ్లిళ్లు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అనేది చూస్తే …
మాఘం అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్ఠమైన మాసంగా దీనిని పరిగణిస్తారు. అందుకే దీనిని మాఘ మాసం అంటారు, పురాణాల్లో కూడా అనేక యజ్ఞయాగాది క్రతువులు ఈ సమయంలో చేశారు.. అందుకే ఈ నెలలో ఏం చేసినా తిరుగు ఉండదు అని చెబుతారు.
ఉత్తరాయణం మొదలైన తర్వాత వచ్చే మాఘమాసం పుణ్యకార్యాలకు శుభప్రదమైంది. మరి ఈ మాఘ మాసం ఎప్పుడు వస్తుంది అంటే ఫ్రిబ్రవరి నెలలో మొదలు అవుతుంది.. అందుకే ఫ్రిబ్రవరిలో చాలా మంది వివాహం చేసుకుంటారు .. చాలా మంది గృహప్రవేశాలకు ఇదే మంచి కాలమని భావిస్తారు. మన దక్షిణ భారత దేశంలో చాలా మంది ఈ మాఘ మాసంలో వివాహం చేసుకుంటారు.