కరోనా మహమ్మారి మన దేశంలో విజృంభిస్తోంది… భారీగా కరోనా కేసులు బయటపడుతున్నాయి..
దీనికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్. దేశంలో ఇప్పటికే టీకా ప్రక్రియ మొదలైంది..
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఇక దీనిపై ఎలాంటి అనుమానాలు లేకుండా అందరూ వాక్సిన్ తీసుకుంటున్నారు.
వైద్యులు నిపుణులు ప్రభుత్వాలు కూడా టీకా తీసుకోవాలి అని తెలియచేస్తున్నాయి..
కరోనా మొదటి డోసు తీసుకున్న కొందరికి సెకండ్ డోస్ అందడంలో కాస్త ఆలస్యమవుతోంది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు, అయితే దీనిపై వైద్యులు ఓ క్లారిటీ ఇచ్చారు..
ఈ సెకండ్ డోస్ తీసుకోవడంలో కాస్త ఆలస్యం అయితే అది పనిచేయదేమో అన్న అనుమానం వద్దు, కాస్త ఆలస్యం అయినా సెకండ్ డోస్ తీసుకోండి.. సెకండ్ డోస్ ఆలస్యమైనా అది పనిచేస్తుందని, ఎవరూ వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండకూడదని చెప్పుకొచ్చారు. ఇక కరోనా వచ్చి తగ్గిన వారు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి అని తెలిపారు… ఈ కరోనా లక్షణాలు అన్నీ తగ్గాక వీరు కూడా కోవిడ్ టీకా తీసుకోవచ్చు.