ప్రస్తుతం పవన్ కల్యాణ్ రెండు సినిమాలు సెట్స్ పై పెట్టారు.. మరో రెండు సినిమాలు చేయడానికి సిద్దంగా ఉన్నారు….ఇక ఇటీవల వకీల్ సాబ్ చిత్రం విడుదల అయింది ..మంచి విజయం సాధించింది.. వంద కోట్ల వసూల్లు వచ్చాయి.. మూడున్నర సంవత్సరాల తర్వాత పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ఇది.. దీంతో అభిమానులు ఎంతో ఆనందించారు.
క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు.. అలాగే మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు సాగర్ కె. చంద్ర.. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రను రానా పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాలో పవన్ భార్యపాత్ర కోసం చాల మందిని పరిశీలిస్తున్నారట.
ఈ రోల్ కోసం టాలీవుడ్ కోలీవుడ్ భామలని చూశారు, తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది..
ముందు పవన్ కల్యాణ్ భార్య పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కాని ఇంకా పైనల్ అవ్వలేదు అని వార్తలు వినిపించాయి.. తాజాగా నిత్యామీనన్ ను ఎంపిక చేసుకున్నారనే వార్త వినిపిస్తోంది. ఇక కరోనా పరిస్దితులు తగ్గిన తర్వాత ఆమె షూటింగ్ కు వస్తారని టాలీవుడ్ టాక్.