దేశంలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి …ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి.. దేశ ఆర్థిక రాజధాని ముంబై ని కూడా కరోనా భయపెడుతోంది, రోజూ ఆర్ధిక రాజధానిలో కూడా వేలాది కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే ఇప్పటికే మహారాష్ట్ర లాక్ డౌన్ లో ఉంది, తాజాగా ముంబై వాసులకి గుడ్ న్యూస్ ఏమిటి అంటే.
ముంబై నగరంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో, కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. పదివేల వరకూ వచ్చే కేసులు కేవలం ముంబైలో కొత్తగా 3,629 కేసులు వెలుగులోకి వచ్చాయి.
73 మంది మహమ్మారి కారణంగా కన్నుమూశారు.
అయితే లాక్ డౌన్ వల్ల ముంబైలో భారీగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి హోటల్స్ సినిమా హాల్స్ రెస్టారెంట్లు ఇలా అన్నీ క్లోజ్ లో ఉన్నాయి దీంతో చాలా వరకూ ప్రజలు బయటకు రావడం లేదు. అందుకే కరోనా కేసులు తగ్గుతున్నాయి అంటున్నారు నిపుణులు. ముంబైలో 6.55 లక్షల మందికి పైగా కరోనా సోకింది.13 వేల మందికి పైగా మరణించారు.