ఏ చిత్ర సీమలో చూసుకున్నా వారసుల ఎంట్రీ అనేది ఉంటుంది.. ముఖ్యంగా హీరోలు హీరోయిన్లు తమ కుమారులు కుమార్తెలను చిత్ర సీమలోకి తీసుకువస్తూ ఉంటారు…ఇక ఇలా చాలా మంది పరిశ్రమకు పరిచయం అయ్యారు.. అయితే సీనియర్ హీరోలు హీరోయిన్లు చాలా మంది ఇలా పరిచయం చేయించారు.
టాలీవుడ్ కి ఒక సీనియర్ హీరోయిన్ వారసురాలిగా వర్ష విశ్వనాథ్ పరిచయమవుతోంది. హీరోయిన్ వాణీ విశ్వనాథ్ కి సోదరి కూతురు. ఇక ఆమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది, టాలీవుడ్ లో హీరోయిన్ గా వాణీ విశ్వనాథ్ కొంతకాలం పాటు తన జోరు చూపించారు. ఇక చాలా సినిమాల్లో నటించారు.
ఘరానా మొగుడు చిత్రంలో ఆమె ఎంతో బాగా నటించారు, ఇక తమిళ్ లో కూడా పలు సినిమాలు చేశారు…ఆమె వారసురాలిగా వర్ష విశ్వనాథ్ పరిచయమవుతోంది.ఇక ఇప్పటికే తమిళంలో మూడు సినిమాలు చేసింది, తెలుగులో ఇప్పుడు ఎంట్రీ ఇస్తోంది…సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి జోడీగా నటిస్తోంది.