మరో చిత్రం రీమేక్ చేసేందుకు చూస్తున్న వెంకటేష్ ? టాలీవుడ్ టాక్

మరో చిత్రం రీమేక్ చేసేందుకు చూస్తున్న వెంకటేష్ ? టాలీవుడ్ టాక్

0
95

టాలీవుడ్ లో రీమేక్ సినిమాల పై మన హీరోలు ఫోకస్ చేస్తున్నారు ..మంచి కథనం స్టోరీ బాగుంది అంటే ఒకే చెబుతున్నారు… తాజాగా రీమేక్ సినిమాలు మనవి కూడా ఇతర భాషల్లో వస్తున్నాయి… అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ ఓ సినిమాపై ఆసక్తి చూపుతున్నారట… ఇప్పటికే దృశ్యం సినిమాని చేస్తున్న ఆయన తాజాగా మరో సినిమాపై ఫోకస్ చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

 

తాజాగా ఆయన తమిళంలో సక్సెస్ అయిన అసురన్ రీమేక్ గా నారప్ప చేశారు. అలాగే మలయాళంలో విజయవంతమైన దృశ్యం 2రీమేక్ లోను చేశారు. ఇక వెండితెరపై ఈ రెండు చిత్రాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. తాజాగా ఆయన మరో మలయాళ సినిమా రీమేక్ లో చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు.

 

మలయాళంలో డ్రైవింగ్ లైసెన్స్అనే సినిమా వచ్చింది. లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ – సూరజ్ నటించారు. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది, మంచి ప్రశంసలు వచ్చాయి, అయితే తాజాగా ఈ సినిమా చూసిన వెంకీ ఈ చిత్రం చేయాలి అని చూస్తున్నారట. టాలీవుడ్ లో ఈ టాక్ అయితే నడుస్తోంది.