ఈ కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు.. భారీగా కేసులు బయటపడుతున్నాయి…సామాన్యులు సెలబ్రిటీలు, సినిమా వారు రాజకీయ నేతలు స్టార్లు పారిశ్రామిక వేత్తలు ఎవరిని వదిలిపెట్టడం లేదు ..తాజాగా మాఫియా డాన్ చోటా రాజన్ కూడా కరోనాకు బలయ్యాడు. కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన చోటా రాజన్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం ప్రాణాలు విడిచాడు.
ఇటీవల తీహర్ జైల్లో ఉన్న రాజన్ కు కరోనా సోకింది వెంటనే అతన్ని అక్కడ అధికారులు ఏప్రిల్ 26న ఎయిమ్స్ కు తరలించారు. అప్పటినుంచి చికిత్స పొందుతున్నాడు. నేడు ప్రాణాలు కోల్పోయాడు..చోటా రాజన్ పై మహారాష్ట్రలో 70కి పైగా క్రిమినల్ కేసులున్నాయి. అతడిని 2015లో ఇండోనేషియాలో అరెస్ట్ చేశారు అధికారులు.
ఇప్పటి వరకూ దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు చోటా రాజన్…2018లో జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ డే హత్య కేసులో రాజన్ దోషిగా తేలాడు. రాజన్ కు జీవిత ఖైదు విధించారు. రాజన్ పై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేశారు.