ఊపిరితిత్తులను టార్గెట్ చేస్తున్న కరోనా వైరస్ – ఇది తప్పక తెలుసుకోండి

ఊపిరితిత్తులను టార్గెట్ చేస్తున్న కరోనా వైరస్ - ఇది తప్పక తెలుసుకోండి

0
93

కరోనా తొలి వేవ్ వచ్చిన సమయంలో యువతపై పెద్ద ప్రభావం చూపించలేదు.. పెద్దలపై తీవ్ర ప్రభావం చూపించింది.. కాని ఇప్పుడు సెకండ్ వేవ్ మాత్రం దారుణంగా ప్రభావం చూపిస్తోంది, యువతని కూడా బలి తీసుకుంటోంది ఈ మహమ్మారి, అయితే చాలా మందికి ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతున్నాయి.

 

కరోనాతో ఆసుపత్రి పాలైన వారికి ఆక్సిజన్ అందించాల్సి రావడం తప్పనిసరిగా మారింది. సెకండ్ వేవ్ లో రూపాంతరం చెందిన కరోనా మహమ్మారి మానవ ఊపిరితిత్తులనే లక్ష్యంగా చేసుకుంటోంది, అందుకే ఆక్సిజన్ చాలా మందికి అవసరం అవుతోంది, యువత – బలంగా ఉన్న వారు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

 

సిటీ స్కానింగ్ చేస్తూ ఉంటే చాలామంది రోగుల ఊపిరితిత్తులు అత్యధిక మొత్తంలో ఇన్ఫెక్షన్ కు గురైనట్టు ఆ సీటీ స్కాన్ ల ద్వారా వెల్లడైంది. ఇలా ఆక్సిజన్ స్ధాయిలు 80 లేదా 85 కు పడిపోతున్నాయి.. కొన్ని కేసుల్లో అయితే కొన్ని గంటల్లో ఒక రోజులోనే ఇంత దారుణంగా పడిపోతున్నాయి వారి ఆక్సిజన్ లెవల్స్.. ఛాతీ నొప్పి వస్తే అస్సలు అశ్రద్ద వద్దు అంటున్నారు వైద్యులు.