మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా తెరకెక్కుతోంది, ఇప్పటికే 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు.. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది, అయితే ఈ సినిమాపై ప్రిన్స్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. యాక్షన్ ఎపిసోడ్స్ ను ఇటీవలే దుబాయ్ లో చిత్రీకరించారు.
ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుంది.. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ సుబ్బరాజు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా వల్ల ఆగిపోయింది, అయితే
ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే దీనిపై ప్రిన్స్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు, అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా కాబట్టి టీజర్ ని అప్పుడే వదలరు… సో ఫస్ట్ లుక్ లేదా ఫస్ట్ గ్లింప్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు అభిమానులు. చూడాలి మరి చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన ఇస్తుందో.