గత ఏడాది కరోనా మహమ్మారి అన్నీ దేశాలను చుట్టేసింది, ఇక ఈ ఏడాది జనవరి నుంచి చాలా దేశాల్లో కరోనా టీకాలు ఇస్తున్నారు.. దీంతో చాలా దేశాలు టీకాలు వేయడంతో కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి, ఇక తక్కువ జనాభా ఉన్న దేశాలు ఈ టీకాలపై ఫోకస్ చేశాయి వాక్సినేషన్ డ్రైవ్ చేస్తున్నారు, అయితే కొన్ని దేశాలు మాత్రం ఇంకా కరోనాతో అల్లాడుతున్నాయి, మన దేశంలో కూడా కేసులు దారుణంగా నమోదు అవుతున్నాయి.
తాజాగా ఓ దేశం కీలక ప్రకటన చేస్తోంది…ఆగస్టు నాటికి బ్రిటన్ లో కరోనా వైరస్ అంతమైపోతుందని ఆ దేశ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్గా రిటైరవుతున్న క్లైవ్ డిక్స్ చెప్పారు. అంటే ఆ సమయానికి కోవిడ్ కేసులు తగ్గిపోతాయి అని ఇక్కడ కోవిడ్ కేసులు ఉండవు అని చెబుతున్నారు.
2022 తొలి మాసాల్లో వ్యాక్సిన్ బూస్టర్ ప్రోగ్రాంను బ్రిటన్ ప్రభుత్వం చేపట్టబోతోంది. అంతేకాదు జూలై చివరిలోగా బ్రిటన్ ప్రజలకు కనీసం ఒక్క డోసు వ్యాక్సినేషన్ను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు ..బ్రిటన్లో 5 కోట్ల పైగా టీకాలు ఇచ్చారు. ప్రజలు వ్యాక్సినేషన్ కు ముందుకు వస్తున్నారు.