బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా అఖండ…లెజెండ్ సింహ సినిమాలు వారిద్దరి కాంబినేషన్ లో ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిందే, అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.. బాలయ్య బాబు లుక్ అదిరిపోయింది… ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు రెండు పాత్రల్లో కనిపించనున్నారు… ఇక భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించారు.
ఈ సినిమాలో కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, ఒక ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది.
బాలకృష్ణ పోషించిన అఘోర పాత్ర అందరిలోనూ కుతూహలాన్ని పెంచుతోంది.. అయితే ఇప్పటి వరకూ ఎవరూ చేయని పాత్ర ఇటు బాలయ్య చేస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి అనూహ్యమైన రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది, లేకపోతే అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అయ్యేది, అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. తమన్ మ్యూజిక్ తో మరో సెన్సేషన్ అవుతుంది సినిమా అంటున్నారు అభిమానులు.