సూపర్ – నాలుగు విషయాలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనీల్ రావిపూడి

సూపర్ - నాలుగు విషయాలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనీల్ రావిపూడి

0
85

టాలీవుడ్లో మంచి విజయాలు దక్కించుకుంటున్నారు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, వరుస సక్సస్ లతో మంచి జోష్ మీద ఉన్నారు ఈ డైరెక్టర్… అయితే ప్రస్తుతం ఆయన ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు, ఇక ఇటీవల కరోనా బారిన పడ్డారు.. అయితే ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు.. ఆయనకు ప్రస్తుతం నెగిటీవ్ వచ్చింది.. తాజాగా కొన్ని విషయాలపై క్లారిటీ అయితే ఇచ్చారు సినిమా అభిమానులకి. మరి అది ఏమిటో చూద్దాం.

ఆయన నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తారని వార్తలు వినిపించాయి? ఇది మల్లీ స్టారర్ అని టాక్ వచ్చింది.?

ఇందులో కల్యాణ్ రామ్ నటిస్తారు అని వార్తలు వచ్చాయి?

అంతేకాదు రవితేజతో సూపర్ హిట్ మూవీ రాజా దిగ్రేట్ కూడా సీక్వెల్ ఉంటుంది అని వార్తలు వచ్చాయి

మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాకు సీక్వెల్ చేయబోతున్నారంటూ మరో వార్త వచ్చింది

తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన అనిల్ రావిపూడి అన్నింటికి క్లారిటీ ఇచ్చారు.. ఇక ఎఫ్ 3 సగం అయింది అని తెలిపారు, ఇక బాలయ్య గారి సినిమా డిఫరెంట్ జోనర్ మూవీ అని తెలిపారు, అంటే ఆ సినిమా ఉన్నట్లే అయితే ఇది మల్టీస్టారర్ కాదు అని క్లారిటీ ఇచ్చారు….అంటే ఇటీవల ఇందులో కల్యాణ్ రామ్ నటిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి.. సో బాలయ్యతో మూవీ ఉంటుంది కానీ మల్టీ స్టారర్ కాదు.

ఇక మహేష్ బాబుతో సినిమా ఉంటుంది అయితే అది సరిలేరు నీకెవ్వరు సీక్వెల్ కాదు అని తెలిపారు.. ఇక మాస్ మహారాజ్ తో రాజాదిగ్రేట్ సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందని అన్నారు, అయితే తాను ఎఫ్ 3 చేస్తున్నా ఇది చేసిన నెల రోజుల తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చెబుతా అన్నారు.