పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటి ఛార్మి

పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటి ఛార్మి

0
86

ఈ మధ్య టాలీవుడ్ లో నటీ నటుల పెళ్లి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక తాజాగా పలువురు హీరోయిన్లు వివాహం చేసుకున్నారు, అయితే రెండు రోజులుగా మరో అందాల తార పెళ్లికి సిద్దం అవుతోందని వార్తలు వినిపించాయి.. ఆమె ఎవరో కాదు నటి ఛార్మీ… అయితే ఆమె తన కుటుంబం చూసిన సంబంధం ప్రకారం బంధువుల అబ్బాయిని పెళ్లి చేసుకుంటోంది అని వార్తలు వినిపించాయి.. అయితే తాజాగా దీనిపై నటి ఛార్మీ స్పందించారు.

 

 

దర్శకుడు పూరీజగన్నాథ్తో కలిసి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఛార్మీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది…

అయితే నటి ఛార్మీ ఈ పెళ్లి వార్తలను కొట్టిపారేశారు. తన వివాహంపై వస్తోన్నవార్తల గురించి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

 

ప్రస్తుతం నేను జీవితంలో బెస్ట్ సమయాన్ని గడుపుతున్నాను. నేను నా జీవితంతో ఎంతో సంతోషంగా ఉన్నాను. లైఫ్లో పెళ్లి చేసుకోవడమనే తప్పును నేను ఎప్పడూ చేయను అంటూ కుండ బద్ధలు కొట్టింది ఛార్మీ. మొత్తానికి పెళ్లి అనే విషయంలో ఛార్మీ ఇంతలా డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏమిటో తనకే తెలియాలి, ఇక ఆమె అభిమానులకి ఈ విషయం పై క్లారిటీ అయితే వచ్చేసింది.