బ్రేకింగ్ – 71 రోజులకే బిగ్ బాస్ సీజన్ రద్దు – కీలక నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్

బ్రేకింగ్ - 71 రోజులకే బిగ్ బాస్ సీజన్ రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్

0
93

ఈ కరోనా సమయంలో చాలా షోలు అర్దాంతరంగా రద్దు అవుతున్నాయి…. ఇప్పటికే సినిమాలు సీరియళ్లు షూటింగులు క్యాన్సిల్ అయ్యాయి.. తాజాగా కన్నడ బిగ్ బాస్ పై కూడా ఈ కరోనా ఎఫెక్ట్ పడింది..ఇంకా ఎనిమిది మంది కంటెస్టెంట్లు హౌస్లో ఉండగానే బిగ్ బాస్కు గుడ్బై చెప్పేశారు. కర్ణాటకలో కేసులు భారీ స్థాయిలో వస్తున్నాయి దీంతో సీజన్ ఆపేశారు.

 

కన్నడలో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న ఈ షో ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. దాదాపు 71 రోజుల పాటు సాగింది. ఇంకా హౌస్ లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు, వారు చాలా సేఫ్ గా ఉన్నా బయట దారుణమైన పరిస్దితులు ఉన్నాయి.. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

కలర్స్ కన్నడ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విజేతగా ఎవర్నీ ప్రకటించలేదు. కాని ఇప్పటి వరకూ ఆట చూసిన నెటిజన్లు మాత్రం ప్రశాంత్ సమ్ బర్గీని విన్నర్ గా డిక్లేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు… బయట దారుణంగా పరిస్దితులు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది.