ఈ ఊళ్లో ఒక్క కరోనా కేసు లేదు – ఈ గ్రామస్తులు ఏం చేస్తున్నారో తెలిస్తే శభాష్ అంటారు

ఈ ఊళ్లో ఒక్క కరోనా కేసు లేదు - ఈ గ్రామస్తులు ఏం చేస్తున్నారో తెలిస్తే శభాష్ అంటారు

0
95

మన దేశంలో ఎక్కడ చూసినా కరోనా మాట వింటున్నాం… ప్రతీ ఊరు ప్రతీ గ్రామం కరోనాతో ఎఫెక్ట్ అవుతోంది.. అనేక గ్రామాల్లో కూడా కరోనా సోకింది…ఇక చాలా మంది ఈ రాకాసి జబ్బు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని పల్లెలు మాత్రం భద్రంగా ఉన్నాయి. అలాంటిదే ఈ గ్రామం కూడా..అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లి గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా రాలేదు.

 

గత ఏడాది కరోనా సమయంలో రాలేదు ఇప్పుడు సెకండ్ వేవ్ సమయంలోనీ రాలేదు, దీనికి కారణం వీరి అలవాట్లు అనే చెప్పాలి, ఈ పంచాయతీ జనాభా సుమారు 2 వేలు , ఇక్కడ గ్రామంలో విద్యార్దులు అందరూ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోనే చదువుతున్నారు, వీరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడ గ్రామ సచివాలయంలోనే పరిష్కారం అవుతోంది

పట్టణాలకి వెళ్లడం లేదు.

 

 

ఇక్కడ రైతులు వేరుశనగ, కంది, వరి, మొక్కజొన్న, బంతి పూలు, తీగ జాతి కూరగాయ పంటలు పండిస్తారు, దాదాపు ఈ గ్రామంలో వారే అవి కొనుక్కుంటారు, ఇక్కడకు కొనడానికి వచ్చిన వారికి అమ్మేసి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

రైతులకు దేశవాళీ ఆవులు, గేదెలు, ఎద్దులున్నాయి. పేడ, అక్కడ దొరికే ఆకులతో తయారైన ఎరువులనే పంటలకు వినియోగిస్తున్నారు. ఇక్కడ చికెన్ షాపు లేదు ఇంట్లో పెంచే నాటు కోళ్లే తింటారు, నిజంగా గ్రేట్ కదా.