ఆర్జీవి ఓటీటీలోకి ఎంట్రీ – స్పార్క్ పేరుతో మే 15 నుండి స్ట్రీమింగ్

ఆర్జీవి ఓటీటీలోకి ఎంట్రీ - స్పార్క్ పేరుతో మే 15 నుండి స్ట్రీమింగ్

0
89

దర్శకుడు ఆర్జీవి ఏం చేసినా సంచలనమే అని చెప్పాలి, ఇక కరోనా పరిస్దితుల వల్ల సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది… మరీ ముఖ్యంగా చాలా మంది పరిశ్రమలో వారు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు.. సినిమాలు ఆగిపోయాయి.. ఇటు చిత్రాలు విడుదల కాక థియేటర్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు… ఇప్పుడు అంతా ఓటీటీ రోజులు అనే చెప్పాలి… గత ఏడాది లాక్ డౌన్ సమయం నుంచి ఈ ఓటీటీలు దూసుకుపోతున్నాయి.

 

తెలుగులో ఇప్పటికే ఆహా ఓటీటీ ఉంది, అయితే తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓటీటీ ప్రారంభించనున్నట్టు అఫీషియల్ గా పేర్కొన్నారు.. ఇక ప్రముఖ టీవీ హోస్ట్ స్వప్న, ప్రముఖ వ్యాపారవేత్త సాగర్ మచనూరు సహకారంతో స్పార్క్ పేరుతో OTT ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు..వీరికి ప్రభాస్, అడివి శేష్ తమ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఇక అంతేకాదు మరో విషయం ఏమిటి అంటే ఇది మే 15 నుంచి స్పార్క్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది..ఇక ఈ కొత్త టీమ్ కు అందరూ బెస్ట్ విసెష్ చెబుతున్నారు.