మీ శరీరంలో యాంటీబాడీస్ పెరగాలంటే ఇలా చేయండి – వైద్యుల సలహా

మీ శరీరంలో యాంటీబాడీస్ పెరగాలంటే ఇలా చేయండి - వైద్యుల సలహా

0
82

ఈ కరోనా మహమ్మారికి ప్రపంచం వణికిపోతోంది మన దేశంలో సెకండ్ వేవ్ కారణంగా లక్షలాది మంది కోవిడ్ బారిన పడుతున్నారు, రోజు వేలాది మరణాలు సంభిస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత శరీరంలో ఉన్న యాంటీబాడీలు పోరాడే గుణాన్ని పెంచుకుంటాయి. వైరస్ పై పోరాటం చేస్తాయి.

 

అయితే శరీరంలో యాంటీబాడీస్ పెరగాలి అంటే ఏం చేయాలి అంటే డాక్టర్లు కొన్ని విషయాలు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్దాలు తింటే యాంటీబాడీస్ పెరుగుతాయి.. కచ్చితంగా ప్రోటీన్స్ ఉండే ఫుడ్ తినండి మాంసం, చికెన్, గుడ్లు బాగా తినాలి… అలాగే జీడిపప్పు, బాదం వంటి వాటిలో ప్రోటీన్స్ బాగా ఉంటాయి. మరీ ఎక్కువ తింటే వేడి అందుకే లిమిట్ గా తీసుకోండి..విటమిన్ A, C, E ఉండే పండ్లు బాగా తినండి. పుల్లగా ఉండే పండ్లు తింటే మీకు యాంటీబాడీస్ అద్భుతంగా పెరుగుతాయి.

 

 

టమాటాలు, నిమ్మకాయలు, కమలాలు, బత్తాయిలు, ద్రాక్ష, పుచ్చకాయ, బొప్పాయి, బ్రకోలీ ఇవి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది… ఇక రోజుకి 20 నిమిషాలు వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయండి…ఉదయం సాయంత్రం వేళ సూర్యుడి ఎండ తగిలేలా చేసుకోండి.. విటమిన్ D పెరుగుతుంది. ఇక ఒత్తిడి లేకుండా చూసుకోండి…ఆలివ్ ఆయిల్ వంటలకు వాడుకోండి..

వేపుళ్లు తగ్గించి ఉడకబెట్టినవి పులుసు వంటలు ఎక్కువ తినండి..మసాలాలు తగ్గించండి. మొలకలు తినండి. ఇక మద్యం వద్దు గుట్కా పాన్ సిగరెట్ అసలు తీసుకోకండి.