ఊహలు గుసగుసలాడే ఈ సినిమా కుర్రాళ్లకు బాగా నచ్చింది ఈ సినిమాతో బ్యూటీ రాశిఖన్నా ఇక వెను తిరిగి చూసుకోలేదు, వరుస సినిమా అవకాశాలు వచ్చాయి, ఇటు తెలుగు తమిళంతో పాటు మలయాళం హిందీ సినిమాలను కూడా ఈ లాక్డౌన్ లో
సైన్ చేసింది, వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారింది ఈ అందాల తార.
ఇప్పుడు
అరణ్మనై-3
మేధావి
తుగ్లక్ దర్బార్
సర్దార్
సైతాన్ క బచ్చా ఇలా లైన్ గా తమిళ చిత్రాలు ఒకే చేసింది.
ఇక తమిళంతో పాటు ఈ అమ్మడు తెలుగులో కూడా పలు చిత్రాలకు సైన్ చేసిందట,
గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తుంది
నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో నటిస్తుంది రాశీ
ఇంకా పలు చిత్రాలకు సంబంధించి కథలు వింటోందట. ఆమె అభిమానులు ఈ వార్త విని చాలా ఆనందంలో ఉన్నారు.