తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 ఆసక్తికర అప్ డేట్

తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 ఆసక్తికర అప్ డేట్

0
77

బిగ్బాస్ ప్రతీ ఒక్కరికి బాగా తెలిసిన పేరు, పెద్దగా పరిచయం కూడా అవసరం లేదు, అన్నీ భాషల్లోనూ సక్సస్ అయింది ఈ షో, అయితే తెలుగులో కూడా సీజన్ 4 ముగిసింది, ఇక సీజన్ 5 కి ఏర్పాట్లు షురు అవుతున్నాయి… అయితే గత ఏడాది కూడా కరోనా వల్ల కాస్త లేట్ గా ఈ షో స్టార్ట్ అయింది… ఇప్పుడు అదే సీన్ ఈ ఏడాది కూడా కాస్త ఆలస్యంగా ఈ షో స్టార్ట్ అవుతుంది అంటున్నారు.

 

అయితే లేట్ అయినా కచ్చితంగా సీజన్ 5 ఉంటుంది అని ఆ వర్గాలు అంటున్నాయి. తెలుగులో మొదటి సీజన్ నుంచి ఈ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. మరి ఈసారి సీజన్ 5 చాలా సరికొత్తగా చేయాలి అని చూస్తున్నారు, టీవీ నటులు సినిమా నటులు కమెడియన్లు సోషల్ మీడియా సెలబ్రెటీలు ఈసారి చాలా మంది స్టార్లని తీసుకురావాలి అని చూస్తున్నారు.

 

ఐదో సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అన్నీ సెట్ అయితే జూన్ నెలలో నిర్వహించాలని నిర్వాహకులు భావించారు, కాని ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉందట. ఆగస్టు నెలలో ఈ షోను ప్రారంభించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… సీజన్ 5 కు నాగార్జున హోస్ట్గా ఉంటారని తెలుస్తోంది..ఇక హైదరాబాద్ లోనే సెట్ వేయనున్నారట.