తెలంగాణలో సర్కారు లాక్ డౌన్ విధించింది. ఉదయం పది దాటితే రవాణా సౌకర్యాలు క్లోజ్ అవుతాయి. బుధవారం ఆసుపత్రిలో చూపించుకుని ఒక గర్భిణీ మహిళ ఇంటికి వెళ్తున్నారు. సమయం పది దాటడంతో ఆటోలు, బస్సులు లేవు. దీంతో కాలినడకన ఆమె వెళ్తున్నారు. అదే రోడ్డులో అటుగా వెళ్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సిఐ) ఘంట మల్లేష్ ఆమెను గమనించి తన వాహనంలో మెహిదీపట్నంలోని తన ఇంటివద్ద క్షేమంగా పంపించారు. సిఐకి సదరు మహిళ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటన హైదరాబాద్ లోని నాంపల్లి కంట్రోల్ రూమ్ వద్ద బుధవారం ఉదయం జరిగింది.