BREAKING NEWS ఆనందయ్య మందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్

0
116

నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం ఎదురుచూస్తున్న కరోనా రోగులకు శుభవార్త. ఆయన మందును ఇక మీరు పొందవచ్చు. ఆనందయ్య మందు పంపిణీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది. కంట్లో వేసే మందును వేయరాదని ఆదేశించింది. మిగతా రకాల మందులను అంటే పొట్టలోకి ఇచ్చే మందులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతించింది.

సిసిఆర్ఎఎస్ నివేదిక ప్రకారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున దాన్ని కొంతకాలం వేయకూదడని ప్రకటించింది.

ఆందయ్య ఇస్తున్న మిగిలిన రకాల మందుల వల్ల ఎలాంటి హాని లేదని నివేదికలు తేల్చి చెప్పాయి. సిసిఆర్ఎఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని స్పష్టమైంది.

కానీ ఆనందయ్య మందు వాడితే కోవిడ్ తగ్గుతుంది అనడానికి ఇంకా నిర్దారణలు లేవని తేల్చి చెప్పాయి నివేదికలు. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదకలు వచ్చిన తర్వాత నిర్ణయం వెలువరిస్తామని ప్రకటించింది సర్కారు.  ఈ నివేదికలు రావడానికి మరో రెండు మూడు వారాల వరకు పట్టే చాన్స్ ఉందని తెలుస్తోంది.

ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన అల్లోపతి మందుల వినియోగం ఆపొద్దని రోగులకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే ఎవరి ఇష్టానుసారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని సూచించింది.

ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా ఉండాలని షరతు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వారికి బదులు వారి కుటుంబీకులు ఎవరైనా వచ్చి మందును తీసుకెళ్తే కోవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని సూచించింది ప్రభుత్వం.

మందు పంపిణీ సమయంలో కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని సూచించింది. సోషల్ డిస్ట్సెన్స్, మాస్క్ తప్పని సరి అని పేర్కొంది.