కోవిడ్ తో మృతిచెందిన అంగన్వాడీ టీచర్ బిడ్డకు 2లక్షల సాయం

Minister sathyavathi rathod cheque distribute to covid victim girl student

0
127

వరంగల్: కోవిడ్ మహమ్మారి వల్ల అనేక మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతున్నారని, ఎంతోమంది నిరాశ్రయులు అవుతున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా అర్భన్ ప్రాజెక్టుద, దీన్ దయాల్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్న జి. వనిత ఈ ఏడాది జనవరి 24వ తేదీన కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం దురదృష్టకరమన్నారు. అప్పటికే భర్త లేని వనిత కోవిడ్ నేపథ్యంలో చనిపోవడంతో ఏడో తరగతి చదువుతున్న ఆమె కూతురు సిరి ప్రియ తల్లిదండ్రులు లేని బిడ్డగా మారిందన్నారు. దీంతో ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో భాగంగా రెండు లక్షల రూపాయల చెక్ ను ప్రాథమికంగా నేడు కుమారి సిరిప్రియకు అందించామన్నారు. ప్రభుత్వ ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద పాల్గొన్నారు.