చేపల గురించి చెబితే నెల్లూరు గోదావరి జిల్లాల పేర్లు వినిపిస్తాయి, అబ్బో చాలా రకాల చేపల పేర్లు మనకు వినిపిస్తాయి… ఇక పులసల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కొన్ని అరుదైన చేపలు ఉంటాయి, వలకు చిక్కాయా వారి పంట పండినట్టే. గంగ పుత్రులు ఆనందానికి ఇక అవధులు ఉండవు. తాజాగా ఇదే జరిగింది, అయితే ఈ చేప పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు.
ఎందుకు అంటే ఇప్పటి వరకూ మీరు విని ఉండరు.అదే క్రోకర్ చేప దీన్ని ఎప్పుడైనా చూశారా..మరి ఇది ఎక్కడ చేప అంటే బలూచిస్తాన్ సముద్రతీరంలో చేపలు పడుతున్న మత్స్యకారుల వలకు ఈ క్రోకర్ చేప చిక్కింది. దీని ఖరీదు విని వారు షాక్ అయ్యారు.
26 కిలోల బరువు ఉన్న ఆ క్రోకర్ చేప ధర ఏకంగా రూ. 7లక్షల 80వేలు పలికింది. ఇక ఆ వల వేసిన వారి పంట పండింది, వారు చాలా ఆనందంలో ఉన్నారు..ఈ చేప స్పెషాలిటీ ఏమిటో తెలుసా, ఇది గాలి నింపుకుని ఈదుతుందట. ఈ చేప ఎయిర్ బ్లాడర్ వైద్య చికిత్సలో ఉపయోగపడుతుండడంతో చైనా, జపాన్, యూరప్లో దీనికి సుమారు 50 లక్షల వరకూ ఇచ్చి కొంటారు . దీని నుంచి దారం తయారు చేస్తారు, అది ఆపరేషన్ లో కుట్ల కోసం వాడతారు.