బ్లాక్ ఫంగస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి ? ఈ తప్పులు చేయకండి

Why black fungus cases are on the rise

0
93

 

ఇప్పుడు దేశంలో కరోనా మహమ్మారితో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి, ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతున్నాయి. అయితే కొందరికి కరోనా సోకకపోయినా బ్లాక్ ఫంగస్ కు అటాక్ అవుతున్నారు.. దీనికి కారణం వైద్యులు చెబుతున్నారు.కరోనావైరస్ సోకక ముందే కొందరు ముందు జాగ్రత్తగా సెల్ఫ్ మెడికేషన్ పేరుతో ఈ కరోనా మందులు అలాగే స్టెరాయిడ్స్ డోసులు అధికంగా తీసుకుంటున్నారు, ఇక ఇంటిలోనే ఇలా సొంత వైద్యం చేసుకోవడంతో ముప్పు తిప్పలు పెడుతోంది.

గుర్తు ఉంచుకోండి స్టెరాయిడ్స్ అధిక వినియోగం వల్లే చాలామంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. అయితే ఇలా స్టెరాయిడ్స్ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే? శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి బ్లాక్ ఫంగస్ బాధితులుగా మారుతున్నారు. వైద్యులు దీనిని చాలా కేసుల్లో గుర్తించారు.

కచ్చితంగా కరోనా రాకుండా ఉంటుంది అని ఇలాంటి స్టెరాయిడ్స్ మందులు అధికంగా వాడుతున్నారు కొందరు. అయితే దయచేసి ఇలా మందులు వాడవద్దు అంటున్నారు.దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు.