ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది, ప్రతీ ఏడాది వాటిని కంటిన్యూ చేస్తోంది, ఏపీలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకొచ్చిన పథకం వైఎస్ఆర్ వాహనమిత్ర. ప్రతీ ఏడాది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం రూ.10వేలు ఇస్తుంది.
వాహన బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతుల కోసం ఈ ఆర్థికసాయం సర్కారు అందిస్తోంది.ఇక ఈ సంవత్సరం కొత్త నిబంధనలతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
2020 జూన్ నుంచి ఈ ఏడాది మే 31లోపు వాహనాలు కొన్నవారు జూన్ 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి గత సంవత్సరం లబ్దిదారుల డేటా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంచారు, ఇందులో పేరు లేకపోతే ధరఖాస్తు చేసుకోవాలి పేరు ఉంటే మళ్లీ అప్లై చేయక్కర్లేదు. గత 6 నెలల ఏప్రిల్ వరకు ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లు దాటితే వారికి ఈ స్కీమ్ రాదు. ఇక అప్లై చేసుకున్న వారి కుటుంబ సభ్యుల్లో ఎవరూ ఐటీ చెల్లింపు చేసేవారు ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగం, పింఛను పొందేవారు ఉన్నా వారికి ఇది వర్తించదు మూడు ఎకరాలకుపైగా మాగాణి, పదెకరాలకు మించి మెట్ట భూమి ఉంటే అనర్హులు. సరకు రవాణా చేసే వారికి ఇది వర్తించదు లబ్దిదారులకి అర్హులకి ఈ 15న ఆర్థికసాయం జమ అవుతుంది.
ఏదైనా అనుమానాలు ఉంటే వాలంటీర్లని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని అడగవచ్చు.