ఈ కరోనా మహమ్మారి చాలా మందిని బలి తీసుకుంటోంది. కుటుంబంలో పెద్దలు తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాధలు అవుతున్నారు. ఇక చాలా చోట్ల కంపెనీలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాయి.ఇక పట్టణాలే కాదు పల్లెలకు కూడా పాకేసింది కరోనా మహమ్మారి. చాలా కంపెనీలు కరోనా సోకిన రోగులకి అడ్వాన్సులతో పాటు మెడికల్ బిల్లులు కూడా చెల్లిస్తున్నాయి.
ఇక మరికొన్ని కంపెనీలు అధిక జీతాలు ఇస్తున్నాయి, ఇక అనేక సౌకర్యాలు తమ కంపెనీ ఉద్యోగులకి కల్పిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల పట్ల మానవత్వం చాటుకుంది కంపెనీ.
కరోనాతో మృతి చెందిన ఉద్యోగులని ఆర్థికంగా ఆదుకుంటాము అని తెలిపింది.. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులే అని తెలిపారు. కోవిడ్తో మృతి చెందిన ఉద్యోగులకు చివరి నెల జీతం ఎంత తీసుకుంటారో అదే జీతం ఐదు సంవత్సరాల పాటు మృతుని కుటుంబానికి అందిస్తామని వెల్లడించింది.మరణించిన ఉద్యోగి పిల్లల చదువు ఖర్చు తామే చూసుకుంటామని, ఉద్యోగి కరోనా బారిన పడిన సమయంలో పూర్తిగా కోలుకునే వరకు కోవిడ్ సెలవు తీసుకోవచ్చు అని తెలిపింది కంపెనీ.