తిరుమ‌ల‌లో రాతి మండ‌ప‌మున‌కు వేంచేసిన శ్రీ‌వారు

TTD Updates

0
119

శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పరమభక్తురాలైన మాతృ శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ రాతి గృహ‌మున‌కు ముందు ఉన్న రాతి మండ‌ప‌ము వ‌ద్ద‌కు గురువారం సాయంత్రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత మ‌ల‌య‌ప్ప స్వామివారు విచ్చేశారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాలు, ఆస్థానం నిర్వ‌హించారు.

ప్ర‌తి ఏడాది న‌ర‌సింహ జ‌యంతి త‌రువాత‌ 10వ రోజున‌ స‌హ‌స్ర దీపాలంకార సేవ అనంత‌రం ఉత్త‌ర మాడ వీధిలోని రాతి మండ‌ప‌ము వ‌ద్ద‌కు శ్రీ‌వారు ఉభ‌య దేవేరుల‌తో క‌లిసి ఊరేగింపుగా వేంచేయ‌డం ఆన‌వాయితిగా వ‌స్తుంది.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.