వెబ్ సైట్ ద్వారా మందు పంపిణీపై ఆనందయ్య తనయుడి క్లారిటీ

anandhaiah covid medicine anandhaiah medicine website anandhaiah website

0
86

ఆనందయ్య మందు విషయంలో అసవరమైన విషయాలు చర్చకొస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొదలుకొని సోషల్ మీడియా వరకు పొంతన లేని విషయాలను ప్రచారం చేస్తున్నారు. అదిగో పులి… అంటే ఇదిగో తోక అన్నట్లు ఈ ప్రచారం సాగుతున్నది.

గత మూడు రోజులుగా ఆనందయ్య మందు పంపిణీ ఆన్ లైన్ లో చేపడుతున్నారనే వార్త చక్కర్లు కొడుతున్నది. ఆన్ లైన్ లో ఆనందయ్య మందు కావాలంటే ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోండి అంటూ ఒక వెబ్ సైట్ ను కూడా తెరమీదకు తెచ్చింది మీడియా.

అసలు ఆ విషయాన్ని ఆనందయ్య కానీ, ఆయన కుటుంబసభ్యుల నుంచి కానీ క్లారిటీ తీసుకోకుండానే బులిటెన్ల మీద బులిటెన్లు లాగించేశారు. కొందరేమో ఆనందయ్య మందు పంపిణీ కోసం పటిష్టమైన వెబ్ సైట్ రూపకల్పన చేస్తున్నారని, సైట్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఊదరగొట్టారు. అయితే ఆన్ లైన్ లో వెబ్ సైట్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీ అనేది లేనే లేదని ఆయన తనయుడు శశిధర్ మీడియాకు క్లారిటీ ఇచ్చారు.

శశిధర్ ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మందు పంపిణీకి ప్రస్తుతం ఎలాంటి వెబ్ సైట్లూ లేవని స్పష్టం చేశారు.

హైకోర్టులో విచారణ పూర్తి :

ఆనందయ్య మందు పంపిణీ విషయంలో హైకోర్టులో విచారణ పూర్తయింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ఆనందయ్య ఇచ్చే కంటి మందును అనుమతించండి అని హైకోర్టు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కంటి చుక్కల మందు నిపుణుల కమిటీ సిఫార్సు చేయలేదని దాన్ని వినియోగించడం సాధ్యం కాదని అడ్వొకెట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మందు పంపిణీ పైనా తగిన ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం తెలిపింది.