ఓ ఎలుక గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నా. ఎలుక గురించి ఏమిటి స్టోరీ అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది మనకంటే చాలా తెలివైన ఎలుక. అందుకే ఈ రోజు వార్లల్లోకి వచ్చింది.. తన తెలివి తేటలతో ఎంతో మంది ప్రాణాలను కాపాడి, హీరో ర్యాట్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఈ ఎలుక ఏం పని చేస్తుందో తెలుసా ఇది డిటెక్టివ్ ఎలుక.
మందుపాతర్లను కనిపెట్టడంలో ఆరితేరిన ఈ ఎలుక పేరు మగావా. మొత్తం దీని సర్వీస్ లో 71 మందుపాతర్లు గుర్తించింది. అంతేకాదు వందల మంది ప్రాణాలు కాపాడింది. అందుకే దీని తెలివికి అందరూ సలాం చేస్తున్నారు. ఈ ఎలుక బరువు 1.2 కిలోలు ఉంటుంది. ఎత్తు 45 సెంటీమీటర్లు , ఆఫ్రికాకు చెందిన జెయింట్ పౌచ్ ర్యాట్ కుటుంబానికి చెందింది ఈ ఎలుక.
బెల్జియంకు చెందిన స్వచ్ఛంద సంస్థ అపోపో ఎలుకలను పెంచుతోంది. అలా పెంచిన ఎలుకలకు కాంబోడియాలో మందుపాతర్లను వెదకటంలో సంవత్సరం పాటు శిక్షణ ఇస్తున్నారు. ఇది కూడా అక్కడ నుంచి వచ్చిందే.కుక్కలా ఈ ఎలుకలు కూడా వాసన ద్వారా మందు పాతర్లను గుర్తిస్తాయి. ఇది ఐదు సంవత్సరాలుగా వర్క్ చేస్తోంది. అందుకే దీనికి అందరూ సలామ్ చేస్తున్నారు. ఇక ఇది జూనియర్ ఎలుకలకు శిక్షణ ఇస్తోందట.