తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కి ఈ క్రేజీ హీరోయిన్ రానుందా ? భారీ రెమ్యునరేషన్

Big Boss Show Season 5 Crazy Heroine

0
91

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.అన్నీ సెట్ అయితే షో ఈ నెలలోనే స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కాని కరోనా సెకండ్ వేవ్ తో మరింత ఆలస్యం అవుతోంది. ఈ సారి ఆగస్ట్ నెలలో బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈసారి కూడా చాలా మంది సెలబ్రిటీలను హౌస్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు నిర్వాహకులు. గతంలో వచ్చిన బజ్ ని దృష్టిలో పెట్టుకుని, ఈసారి మరింత సరికొత్తగా షోని డిజైన్ చేస్తున్నారు.

ఈసారి కూడా యాంకర్స్ ,హీరోయిన్స్ కు పెద్దపీట వేస్తున్నారు. తాజాగా సీజన్ 5లో ఓ అందాల భామను తీసుకురావాలని చూస్తున్నారట. ఆమె ఎవరో కాదు (ఆర్ ఎక్స్ 100 ఫేమ్) కుర్రకారు ఫేమస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆమెతో బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నారట.

ఇక వారానికి 10 నుంచి 15 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈలోపు ఆమె చేతిలో ఉన్న సినిమాలు పూర్తి అయితే, ఆమె హౌస్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయట. అయితే షో సమయానికి ఆమె రాకపోతే స్పెషల్ ఎంట్రీతో హౌస్ లోకి పంపే ఛాన్స్ ఉందంటున్నారు. చూడాలి ఈ వార్తలు అయితే బుల్లితెర వర్గాల్లో వినిపిస్తున్నాయి.