ఉదయం పెళ్లి చేసుకుని – రాత్రి ప్రియుడితో పారిపోవాలని ప్లాన్ -చివరకు ఏమైందంటే

Get married in the morning - plan to run away with boyfriend at night

0
131

ఈరోజుల్లో పెళ్లి అనేసరికి అమ్మాయిలకి కాదు అబ్బాయిలకి టెన్షన్ వస్తోంది. పెళ్లి మండపానికి ఎవడు వచ్చి, ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, కొన్ని నెలలుగా మేము తిరగని పార్క్ లేదు, చూడని సినిమా లేదు అంటారేమోనని. అందుకే మూడు ముళ్లు ఏడు అడుగులు వేసేవరకూ గుండెలు కొట్టుకుంటున్నాయి అబ్బాయిలకి. అయితే ఇక్కడ జరిగిన సీన్ వింటే నిజంగా షాక్ అవుతారు.

ఈ యువతి ఉదయం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని, రాత్రికి ప్రియుడితో కలిసి పారిపోవాలని స్కెచ్ వేసింది. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. షాద్ నగర్ కు చెందిన యువతికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది.

అందరూ వరుడి గ్రామానికి చేరుకున్నారు. నిన్న పెళ్లి పీటలపై కూర్చున్న వధువు అదే పనిగా సెల్ఫోన్లో చాటింగ్ చేస్తోంది. దీంతో బంధువులకి అనుమానం వచ్చింది. ఆమెని ప్రశ్నిస్తే అసలు నిజం చెప్పింది. మూడేళ్ల నుంచి నేను ఓ అబ్బాయి లవ్ లో ఉన్నామని, నాతో ట్రాక్ నడిపిన అబ్బాయితో ఈ రోజురాత్రి పారిపోవాలనుకున్నానని చెప్పింది. ఇక ఆ ప్రియుడు కూడా అదే కల్యాణ మండపం దగ్గర అనుమానాస్పదంగా తిరిగాడు. అతన్ని పట్టుకుని బంధువులు చితక్కొట్టారు. సెల్ఫోన్లో ఇద్దరూ కలసి దిగిన ఫొటోలను చూసి అంతా షాకయ్యారు. మొత్తానికి పెళ్లి క్యాన్సిల్ అయింది.