నేనైతే ఏ తప్పు చేయలేదమ్మా : టీడీపీ అభ్యర్థి

నేనైతే ఏ తప్పు చేయలేదమ్మా : టీడీపీ అభ్యర్థి

0
103

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన మంత్రులు సైతం దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. అలాంటివారిలో పెనమలూరు నుంచి పోటీచేసిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కూడా ఉన్నారు. అయితే, ప్రసాద్ తన ఓటమి అనంతరం కుంగిపోకుండా ధైర్యంగా ప్రజల మధ్యకు వచ్చారు. రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ పై ఒక్కడే పెనమలూరు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు.

బైక్ మీద వెళుతూ ప్రతి ఇంటిముందు ఆగి అక్కడి వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పారు. “ఓటు వేసిన వాళ్లకు థ్యాంక్స్, నేనైతే ఏ తప్పు చేయలేదమ్మా. ఒకవేళ ఏమైనా తప్పు చేసుంటే మాత్రం క్షమించండి” అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగిపోయారు. ఓటమి అనంతరం కుంగి పోయి ప్రజల మధ్యకు రాని మంత్రుల కన్న ఓటమిని కూడా ఇంత పాసిటివ్ గా తిసుకున్న బోడె ప్రసాద్ నిజంగా ధైర్య వంతుడు.