భారతదేశంలో కొన్ని వేల ఆలయాలు ఉన్నాయి. అయితే అనేక పుణ్య క్షేత్రాల్లో నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు.చాలా ఆలయాల్లో పురుషులు, స్త్రీలు కూడా వెళ్లి దర్శించుకుంటారు. కానీ మీకు తెలుసా కొన్ని దేవాలయాల్లో కేవలం పురుషులకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇక స్త్రీ లకి అనుమతి లేదు. మరి ఇలాంటి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అనేది చూద్దాం.
- జైన్ దేవాలయం – రాజస్థాన్లోని రనక్ పూర్ లో ఉన్న జైన్ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. ఇక్కడ పురుషులకి మాత్రమే అనుమతి ఉంటుంది. ఏనాటి నుంచో దీనిని పాటిస్తున్నారు.
2. శ్రీ పద్మనాభస్వామి ఆలయం– కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు. అయితే ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయి అక్కడ స్త్రీలకి అనుమతి లేదు.
3. అస్సాంలో ఉన్న పట్ బాసి సత్ర ఆలయం–ఇక్కడ పురుషులకి మాత్రమే అనుమతి ఉంది.
4. శని సింగ్నాపూర్ –మహరాష్ట్రలోని ఈ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. ఇక్కడ బావి నుంచి స్వామికి అభిషేకం కోసం నీరు తీసుకువస్తారు. అక్కడకు కూడా స్త్రీలకు అనుమతి లేదు. పురుషులు మాత్రమే దర్శించుకుంటారు.
5. మధ్యప్రదేశ్ జైన్ ఆలయం- మధ్యప్రదేశ్లోని గుణలోని జైన్ ఆలయంలోకి సాంప్రదాయ దుస్తులు వేసుకుంటేనే అనుమతిస్తారు.పాశ్చాత్య దుస్తులు వేసుకుంటే రానివ్వరు.