మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడేనా ?

Mahesh Babu - Trivikram Movie launch Clarification

0
106

 

సర్కారువారి పాట సినిమా చేస్తున్నారు ప్రస్తుతం మహేష్ బాబు. అయితే ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో షూటింగ్ కి విరామం ఇచ్చారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రిన్స్ సినిమా చేయనున్నారు. ఈ సినిమా కి సంబంధించి ఓపెనింగ్ సెర్మనీ మే 31న స్టార్ట్ అవుతుందనుకున్నారు అభిమానులు కాని కాలేదు.

అయితే మరి ఎప్పుడు ఈ చిత్రం స్టార్ట్ చేస్తారు అంటే టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందట. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న ఈ మూవీ లాంచనంగా ప్రారంభం కానుందంటున్నారు. కానీ సెంటమెంట్ ప్రకారం మహేష్ బాబు ఈవెంట్ లో పాల్గొనే ఛాన్స్ ఉండదని తెలుస్తోంది.

ఇక సర్కారు వారిపాట, త్రివిక్రమ్ చిత్రం రెండూ ఒకేసారి డేట్స్ ఎడ్జిస్ట్ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఇక అతడు ఖలేజా తర్వాత వీరి కాంబోలో మూడో చిత్రం రాబోతోంది.