సోంపు గింజలు వారానికి రెండు సార్లు తీసుకున్నా మంచిదే. ఇక నోటి దుర్వాసన చిగుళ్లు ఇబ్బంది ఉన్నవారు రోజు ఓ స్పూన్ సొంపు గింజలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ సొంపులో కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, సెలీనియం, మెగ్నీషియం ఉంటాయి, శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
అజీర్తి జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయి.బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇక మలబద్దక సమస్య తగ్గుతుంది.ఆక్సిజన్ స్థాయిలు బ్యాలెన్స్గా ఉండేందుకు సాయపడుతుంది.
సోంపుగింజలలో యాంటీ కేన్సర్ గుణాలు ఉన్నాయి. బీపీ నార్మల్ గా ఉంచేందుకు సొంపు సాయపడుతుంది. ఇక రాత్రి ఓ స్పూన్ సొంపు గింజలు నీటిలో నానబెట్టి ఉదయం ఆనీటిని తాగితే మలబద్దకం జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.