వారానికి ఓసారి చేపలు తింటే కలిగే లాభాలు ఇవే

Benefits of eating fish

0
87

 

ఈ ప్రపంచంలో శాఖాహారులు ఉన్నారు మాంసాహారులు ఉన్నారు. మన దేశంలోనే కాదు అన్నీ దేశాల్లో ఇలాంటి వారు ఉన్నారు. అయితే శాఖాహారమైనా, మాంసాహారమైన కూడా అనేక రకాల వంటకాలు ఉన్నాయి. ముఖ్యంగా మాంసాహారం తినే వారిలో ఎక్కువగా చికెన్ తింటారు. అయితే సీ ఫుడ్ లో చేపలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

చేపలు ఒకటే కాదు సీ ఫుడ్ అయిన రొయ్యలు, పీతలు ఇవి కూడా ఆరోగ్యానికి మంచివే.అయితే ఇందులో చేపలకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. ఎన్నో రకాల పోషకాలు మనకు అందుతాయి. అంతేకాదు వారానికి ఓసారి తిన్నా గుండె జబ్బులు దూరం అవుతాయి.

చేపల్లో కాల్షియం, పాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్ ఖనిజ పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇక గుండె జబ్బులు ఉన్న వారు తిన్నా మంచిదే. ఆస్తమా వారికి క్యూర్ అవ్వడానికి పనిచేస్తుంది. ఇక షుగర్ ఉన్న వారు కూడా వీటిని మితంగా తీసుకోవచ్చు. చేపల్లో ఉండే ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్ఏ, ఈపీఏ వంటివి మనకు చాలా మంచిది. కంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూపుకి మేలు చేస్తాయి.