చిత్ర సీమలో విషాదకర ఘటన జరిగింది. దిగ్గజ గాయకుడు ఘంటసాల కుమారుడు రత్నకుమార్ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో చిత్ర సీమలో విషాదం నెలకొంది. టాలీవుడ్ చిత్ర సీమలో డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దిగ్గజ గాయకుడు ఘంటసాల. ఇక ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ చిత్ర సీమలో కొనసాగారు ఆయన కుమారుడు రత్నకుమార్.
చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు, కోలుకున్న తర్వాత ఇంటికి వచ్చారు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నాయని తేలడంతో ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు.
ఇక సౌత్ ఇండియాలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయనకు ఎంతతో పేరు ఉంది.బాలీవుడ్లోనూ పలు చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. ఇక ఆయన పేరుమీద ఓ రికార్డు కూడా ఉంది.ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ, రత్నకుమార్ స్థానం పొందారు. ఇక దాదాపు ఆయన 1000 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు సౌత్ ఇండియా భాషల చిత్రాలకు, హిందీ చిత్రాలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. తెలుగులో 30 సినిమాలకు ఆయన మాటలు కూడా అందించారు. ఆయన మరణంతో టాలీవుడ్ చిత్ర సీమ ప్రముఖులు సంతాపం తెలిపారు.