ఆ ఇద్దరు దర్శకులతో బన్నీ సినిమా – టాలీవుడ్ టాక్ ?

Allu Arjun Movie Updates

0
110

 

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో బన్నీ చాలా మంది దర్శకులు చెప్పిన కధలు విన్నారట. అయితే వేటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది మాత్రం బయటకు రావడంలేదు. ఎక్కువగా బన్నీ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తారు అనేది తెలిసిందే. ప్రస్తుతం బన్నీ రెండు చిత్రాలు ఒకే చేశారు అనే టాక్ నడుస్తోంది టాలీవుడ్ లో.

స్టార్ డైరెక్టర్ మాస్ పల్స్ పట్టుకున్న బోయపాటితో ఆయన సినిమా ఉంటుంది అని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా విక్రమ్ కుమార్ తో కూడా ఓ లవర్ బాయ్ స్టోరీలో నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో దర్శకుడు విక్రమ్ కుమార్ వైవిధ్యభరితమైన కథలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయన కధలు, హీరో సెలక్షన్ చాలా బాగుంటుంది.

అయితే బన్నీ వీరిద్దరి సినిమాలు ఒకే చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కాని దీనిపై అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం విక్రమ్ కుమార్ చైతూ హీరోగా థ్యాంక్యూ సినిమా చేస్తున్నారు.