ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం విడుదల ఆ పండుగ రోజేనా ?

radhe shyam movie release date

0
102

ప్రభాస్ అభిమానులు రాధే శ్యామ్ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిటింగ్. అయితే చాలా రోజులు అయింది ప్రభాస్ సినిమా అప్ డేట్ వచ్చి. ఇక ఆగలేము రిలీజ్ డేట్ చెప్పండని అభిమానులు తెగ కోరుతున్నారు. ఓ పక్క ఆదిపురుష్ ,సలార్ రెండు కూడా షూటింగులు మధ్యలో ఉన్నాయి. ఇక రాదేశ్యామ్ పూర్తి అయింది.

ఈ సినిమా త్వరలో విడుదల కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు కరోనా కేసులు కాస్త తగ్గుతున్నాయి.థియేటర్లు జూలై నుంచి తెరిచే అవకాశం ఉండచ్చు అంటున్నారు. ఒకవేళ తెరిచినా సగం సీట్లకు మాత్రమే పర్మిషన్ ఇవ్వచ్చు. ఫుల్ ఆక్యుపెన్సీతో షోలు పడటానికి మరికొంత కాలం పడుతుంది.

అయితే రాధేశ్యామ్ సినిమా టాలీవుడ్ టాక్ ప్రకారం దసరాకి విడుదల చేయవచ్చని అనుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్రం రిలీజ్ పై చిత్ర యూనిట్ ప్రకటన చేస్తే బాగుంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ కోరుతున్నారు.