ధనవంతులు సంపాదించిన ఆస్తి తమ వారసులకే ఇస్తారు అనేది తెలిసిందే. అయితే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా తన ఆస్తిలో కొంత భాగాన్ని తమ పిల్లల పేరు మీద రాశారు. ఎన్నో సంవత్సరాలు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా రికార్డు నమోదు చేశారు బిల్ గేట్స్. అయితే ఇటీవల భార్య మెలిండాతో విడిపోయారు. ఈ సమయంలో ఆమెకి సుమారు 13 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చారు.
ఇక వారి పిల్లల విషయానికి వస్తే, బిల్ గేట్స్ కు ముగ్గురు సంతానం
పెద్ద కుమార్తె జెన్నిఫర్ కేథరీన్ గేట్స్
చిన్న కుమార్తె ఫోబ్ అడిలె గేట్స్
కుమారుడు రోరే జాన్ గేట్స్
పెద్దకుమార్తె జెన్నిఫర్ కేథరీన్ గేట్స్ నిత్యం వార్తల్లో ఉంటారు. ఆమె వయసు పాతిక సంవత్సరాలు, ఆమెకి ఉన్న ఆస్తి 25 బిలియన్ డాలర్లు. అంటే మన డబ్బుల్లో చెబితే లక్షా 82 వేల కోట్ల రూపాయలు. ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆమె త్వరలో నాయల్ నాజర్ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరూ కలిసి చదువుకున్నారు.