వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎప్పటి నుంచి మందు తాగొచ్చు?

0
61

చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆల్కహాల్ తీసుకోవొచ్చా? లేదా? అసలు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎన్నిరోజుల తర్వాత మందు తాగొచ్చు? ఆల్కహాల్ అలవాటున్నవాళ్లు వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో ఏ జాగ్రత్తలు పాటించాలి? కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని మందు తాగితే ఇమ్యూనిటీ పెరగదా? అసలు వ్యాక్సిన్ తీసుకుని మందు తాగితే ఆ వ్యాక్సిన్ పనిచేస్తదా? లేదా అనే డౌట్స్ సహజంగా ఉంటాయి. వీటిని కొందరు నిర్భయంగా అడుగుతారు. మరికొందరు అడగలేక సతమతమవుతుంటారు. అలాంటి వారికోసమే ఈ న్యూస్… చదవండి.

వ్యాక్సినేషన్, ఆల్కహాల్ మధ్య సబంధం గురించి మొదట్లో డిస్కషన్ చాలా జరిగింది. ఇది డిస్కషన్ మాత్రమే. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆల్కహాల్ తీసుకుంటే బాడీలో ఇమ్యూనిటీ రాకపోవచ్చు అని చర్చ జరిగింది. కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. ఫైనల్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఆల్కహాల్ కు, వ్యాక్సినేషన్ కు సంబంధం లేదు.

కానీ వ్యాక్సినేషన్ తీసుకున్న రోజున సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం కొంత మందిలో ఉంటాయి. వందలో 20 మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. బాడీ పెయిన్స్, చలి, గొంతునొప్పి లాంటివి రావడం జరగొచ్చు. ఇవన్నీ వచ్చే చాన్సెస్ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకుంటే మత్తులో దేనిద్వారా అవి వచ్చాయో తెలియని కన్ఫ్యూజన్ ఉంటుంది.

ఆల్కహాల్ అనేది వ్యాక్సిన్ కు ఏమాత్రం అడ్డు కాదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా బాడీ పెయిన్స్ వచ్చేది ఉంటే ఆల్కహాల్ వల్ల ఇంకా పెయిన్స్ ఉండే చాన్సెస్ ఉంటాయి. అయితే పరిస్థితులను చూస్తే… వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతకాలం ఆల్కహాల్ తీసుకోకపోతేనే మంచిది. సాధారణంగా కూడా ఆల్కహాల్ అనేది ఆరోగ్యం పాడు చేస్తుంది. అధిక మోతాదులో, మితిమీరిన ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదని డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. కాకపోతే సోషల్ డ్రింకింగ్ అంటే పార్టీకో, పండుగకో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పెద్దగా నష్టంలేదు. కానీ మితిమీరి తాగితే అది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతైనా.. ఇంకో సందర్భంలోనైనా ఆరోగ్యానికి మంచిది కాదు అని డాక్టర్లు సూచిస్తున్నారు.