తెలుగులో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్..!!

తెలుగులో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్..!!

0
95

తెలుగులో ‘మహానటి’ తరువాత కీర్తి సురేశ్ దూకుడు ఒక రేంజ్ లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ స్టార్ హీరోల సినిమాల నుంచి ఆమెకి అవకాశాలు రాలేదు. దాంతో నాయిక ప్రాధాన్యత కలిగిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి, ఆ ప్రాజెక్టు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె మరో లవ్ స్టోరీకి ఓకే చెప్పేసినట్టుగా సమాచారం.

నితిన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ‘భీష్మ’ షూటింగ్ ముందుగా మొదలై డిసెంబర్ 20వ తేదీన విడుదలవుతుంది. ఆ తరువాత వెంకీ అట్లూరి .. నితిన్ .. కీర్తి సురేశ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది.