బిగ్ బాస్ 5 ఎంట్రీ వార్తలపై హీరోయిన్ పాయల్ ఏమందంటే ?

payal rajput clarification on bigg boss 5 entry

0
87

తొలి సినిమాతోనే కుర్రకారుని తన అందంతో కట్టిపడేసింది పాయల్ రాజ్ పుత్. తర్వాత అనేక సినిమాలు చేసింది. ఇక ఈ భామ గురించి తాజాగా ఓ వార్త వైరల్ అయింది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5లో ఈ హాట్ బ్యూటీ రానుంది అని వార్తలు వినిపించాయి. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ దీనిపై క్లారిటీ ఇస్తుంది అని అందరూ అనుకున్నారు.

ఈ వార్తలు టాలీవుడ్ లో బాగా వినిపించాయి. ఇక పాయల్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకున్నారు. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది పాయల్. తాను బిగ్ బాస్ 5లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లలోకి అనవసరంగా తనని లాగొద్దని చెప్పుకొచ్చింది పాయల్.

మొత్తానికి పాయల్ క్లారిటీ ఇవ్వడంతో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం లేదనేది తేలిపోయింది.
ఆర్ఎక్స్ 100
ఆర్డీఎక్స్
వెంకీ మామ
డిస్కో రాజా ఈ చిత్రాల్లో నటించింది పాయల్