వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ నిర్మాణంలో తలమునకలయ్యారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలను సమీకరించే పనిలో పడ్డారు. తొలుత ఆమె ఖమ్మం జిల్లాలో తన తల్లి విజయమ్మతో కలిసి సభ జరిపారు. తర్వాత హైదరాబాద్ లోని ఇందిరాపార్కులో యువతకు ఉద్యోగాలు కల్పించాలంటూ దీక్ష కూడా చేశారు. తర్వాత వికారాబాద్ లో పర్యటించారు. అక్కడ నష్టపోయిన వరి రైతులను పరామర్శించేందుకు వెళ్లారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ… వికారాబాద్ లో షర్మిల ఒక దగ్గర భయపడి కేకలు పెట్టారు. ఎందుకంటే…
ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు వెళ్లిన షర్మిల ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యం బస్తాలను కప్పిపెట్టి ఉంచారు. ఆమె పర్యటనలో భాగంగా ఆ వరి ధాన్యం బస్తాలపై కప్పి పెట్టి ఉంచిన కవర్ ను తీసి చూసే ప్రయత్నం చేశారు. ఆమె తీయగానే బల్లి ప్రత్యక్షమైంది. దీంతో హొ… అంటూ భయంతో కేక పెట్టారు. అక్కడున్నవారు ఆమెను సముదాయించారు. కొన్ని టివిఛానెళ్లలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.
https://www.facebook.com/alltimereport/videos/959975411328450