అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమా ఎప్పుడా అని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది అని అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే తాజాగా నిర్మాత బన్నీ వాసు దీనిపై స్పందించారు.
బన్నీ పుష్ప 1 చేసిన తరువాత ఐకాన్ సెట్స్ పైకి వెళుతుందని ఆయన అన్నారు. ఆ తరువాతనే పుష్ప 2 షూటింగ్ మొదలవుతుందని చెప్పారు బన్నీ వాసు.. సో మొత్తానికి క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ మాట విని బన్నీ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
పుష్ప ఫస్టు పార్టుకు సెకండ్ పార్టుకు మధ్య ఐకాన్ చిత్రం ఉంటుంది. ఇక ఐకాన్ తర్వాత మరో రెండు భారీ ప్రాజెక్టులు డిస్కషన్ లో ఉన్నాయట. తమిళ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కూడా ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఐకాన్ సినిమాకి దర్శకుడుగా వేణుశ్రీరాం, నిర్మాత దిల్ రాజు చేయనున్నారు.