తాప్సీ పెళ్లిపై వార్తలు వైరల్ – క్లారిటీ ఇచ్చిన భామ

Actress Taapsee Pannu Clarification on her marriage

0
94

ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్లు ఒక్కొక్కరు వివాహ బంధంతో ఒకటవుతున్నారు. ఈ సమయంలో నెక్ట్స్ ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారు అనేదానిపై అనేక వార్తలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా తాప్సీ పెళ్లి అంటూ కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అయ్యాయి.

డెన్మార్క్ కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మ్యాథ్యూస్ తో హీరోయిన్ తాప్సీ ప్రేమలో పడిందని.. వారు పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై తాప్సీ క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశం లేదని చెప్పింది.అంతేకాదు సినిమా రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది.

మనం రాణించే వృత్తి, వ్యక్తిగత జీవితం అనేవి వేర్వేరుగా ఉండాలని తెలిపింది, ఇక డెన్మార్క్ కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మ్యాథ్యూస్ తనకు మంచి మిత్రుడు అని చెప్పింది, ప్రస్తుతం తను ఏడాదికి ఆరు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాను. ఇక సినిమా అవకాశాలు తగ్గిన సమయంలో పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది.