తగ్గిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

Today Gold And Silver Rates

0
115

గత నెల రోజులుగా చూస్తే బంగారం ధర పెరుగుదల నమోదు చేసింది. ఎక్కడ చూసినా కొనుగోళ్లు లేవు కాని పెట్టుబడులు పెరగడంతో బంగారం ధర పెరుగుతూనే ఉంది. అయితే జూన్ నెలలో మాత్రం కాస్త తగ్గుదల నమోదు చేసినా, ఆల్ టైం హైకి చేరే దిశగా పెరుగుతోంది. మరి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

ఈరోజు బంగారం ధర హైదరాబాద్ లో చూస్తే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు 10 రూపాయలు తగ్గింది. దీంతో రూ.45,740 కి ట్రేడ్ అవుతోంది … 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.49,890 కి ట్రేడ్ అవుతోంది. 10 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. ఇక బంగారం ధర గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుదల నమోదు చేసింది.

బంగారం ధర ఇలా ఉంటే వెండి ధర ఎలా ఉంది అనేది చూద్దాం. వెండి ధర కిలో రూ.77,300 కి ట్రేడ్ అవుతోంది. వెండి ధర నిన్న- ఈ రోజు సాధారణంగానే ఉంది. ఎక్కడా పెరుగుదల లేదు తగ్గుదల లేదు.