త్రివిక్రమ్ పెళ్లి కూడా ఓ సినిమా స్టోరీని తలపిస్తుంది ? ఈ ఫోటో చూడండి

Director Trivikram's wedding is also a movie story

0
85

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆయన సినిమా అంటే అభిమానులు ఎంత ఇష్టపడతారో తెలిసిందే. ముఖ్యంగా ఆయన మాటలు అద్భుతం. సినిమాలో ఆయన మాటలు వింటే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఆయన చిత్రాలు అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి ఆయన చిత్రాలు. అయితే మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెళ్లి ఎలా జరిగిందో తెలుసా, నిజమే ఇది కూడా సినిమా స్టోరీని తలపిస్తుంది.

అక్కని చూడడానికి వెళ్లి చెల్లిని ఇష్టపడి ఆమెని పెళ్లి చేసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. టాలీవుడ్ ప్రముఖ గేయరచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు సౌజన్యను త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నారు.ఆమె మంచి డ్యాన్సర్. ముందు త్రివిక్రమ్ సౌజన్య అక్కని పెళ్లిచూపులు చూసేందుకు వెళ్లారట.

కానీ అక్క పక్కన ఉన్న సౌజన్యని చూసి ఇష్టపడ్డారట. వెంటనే తన మనసులో మాటను సౌజన్య తల్లిదండ్రులకు చెప్పారట, ఇక మంచి సంబంధం తెలిసిన వారు కావడం, అబ్బాయి మంచివాడు అలవాట్లు లేవని పెద్దలు ఒప్పుకున్నారు. అయితే సౌజన్య అక్కకి పెళ్లి అయిన తర్వాత, త్రివిక్రమ్ సౌజన్యను వివాహం చేసుకున్నారు.