తెలంగాణలో కియా మోటార్స్ కు డీలర్ కేసిఆరే

Mlc Jeevan Reddy Comments on KCR is the dealer for Kia Motors in Telangana

0
81

జగిత్యాల: రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు కియో వాహనాలు, పోలీసులకు ఇన్నోవా లు అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కియో, ఇన్నోవా కంపెనీలకు డీలర్ గా మారాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు.

సోమవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫాం హౌస్ పై విచారణకు అదేశించాలని,నిబంధనల ప్రకారం ఉంటే దానిపై కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకనుగుణంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి ఇవ్వాల్సి ఉంటుందని 2018 జూన్ నుంచి ఇవ్వాల్సి ఉండగా 2021 ఏప్రిల్ నుంచి ఇస్తాననడం, మిగతాది ఉద్యోగులు పదవి విరమణ పొందినప్పుడు చెల్లిష్టాననడం ఉద్యోగులకు నష్టం జరుగుతుందని చెప్పారు.

దీనికి ఉద్యోగ సంఘాలు కేసీఆర్ కు పాలాభిషేకం చేయడం విడ్డురంగా ఉందన్నారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లి ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తూ ఈవిషయం సీఎం, ఉద్యోగ సంఘలానేతలకే తెలియాలన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు స్వార్థంతో ఆలోచిస్తూ ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత్వం దగ్గర తాకట్టుపెడుతున్నారని వారి తీరును దుయ్యబట్టారు. ఆత్మబాలిధానాలతో సాధించుకున్న తెలంగాణలో ఏడేళ్లుగా ఉద్యోగనియామకాలు లేవని రాష్ట్రంలో లక్ష 97వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని, ఇదేనా మనం కొట్లాడి సాధించుకున్నదని విమర్శించారు. ప్రయివేట్ వివిద్యాలయాలను ప్రోత్సహిస్తూ కెసిఆర్ విద్యను అంగట్లో అమ్మకానికి పెట్టాడని జీవన్ రెడ్డి కేసీఆర్ తీరుపై మండిపడ్డారు.2014 కు ముందున్న కేసీఆర్ ఆస్తులెన్ని ఇప్పుడున్న ఆస్తులెన్ని వీటిపై కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

పిసిసి చీఫ్ పరిశీలనలో ఉంది
టిపిసిసి అధ్యక్ష పదవి కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనలో ఉందని జీవన్ రెడ్డి అన్నారు. అధిష్టానం ఎవరికీచ్చిన కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఐక్యంగా ఉండి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యం చేస్తామని జీవన్ రెడ్డి అన్నారు.